జైలు నుంచే ఎమ్మెల్యే అయ్యాడు… ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు…

-

బీహార్ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే హాట్ టాపిక్ అయ్యారు. అకాంత్ సింగ్ మోకామా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆర్జేడీ అభ్యర్థిగా ఉన్నారు. హత్య, దోపిడీ, కిడ్నాప్, అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం వంటి 38 క్రిమినల్ కేసులు ఆయనపై ఉన్నాయి. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మోకామా నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా.

అతను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి జైలు నుంచే పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించాడు. 2005 మరియు 2010 సంవత్సరాల్లో కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2020 లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఒకవేళ అతను అనర్హత వేటు ఎదుర్కొంటే… తాను రాజకీయాల నుంచి తప్పుకున్నా సరే ఇబ్బంది లేకుండా భార్యను నిలబెట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version