ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై మరో కేసు నమోదు

-

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ పై మరో కేసు నమోదు అయింది. మల్లన్న తమ కులాన్ని కించపరుస్తూ ప్రసంగం చేశాడని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో  శుక్రవారం రెడ్డి సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షుడు వాసన అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. చింతపండు నవీన్ అలియాస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం రెడ్డిలపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రెడ్డి సంఘ సభ్యులను దూషించడం సబబు కాదని.. మల్లన్న పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇటీవల వరంగల్ సభలో రెడ్డి కులస్తులపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు బీ ఫారం ఇవ్వని ఇవ్వని వారితో బీసీలకు ఇక యుద్దమేనని కీలక ప్రకటన చేశారు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గాన్ని కుక్కలతో పోల్చుతూ దూషించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version