చాలా మందికి ఈ రోజుల్లో బట్టలు కొనడం ఒక పిచ్చిలా మారిపోయింది. నెల వారీ ఆదాయంలో బట్టల కోసం ఇంత అని కేటాయించడం కూడా మనం చూస్తున్నాం… దీనితో అనేక షాపులు మోడల్స్ ని పెంచడం, బ్రాండ్ల సంఖ్యా పెంచుతూ వినియోగదారులను ఆకట్టుకోవడం వంటివి క్రమంగా చేస్తున్నాయి. ఈ క్రమ౦లో కొనుగోలుదారుల వీక్నెస్ ని పడుతూ వారి జేబులను గుల్ల చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో మనం తొందరపడకుండా జాగ్రత్తపడితే ఎక్కువ బట్టలు తక్కువ సొమ్ముతో కొనుక్కోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
ఇప్పుడు చాలా షో రూమ్స్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఉదాహరణకు అన్ లిమిటెడ్ అనే షో రూమ్ తీసుకుంటే ఇక్కడ చాలా ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ ధరకే బ్రాండ్లు… 30 శాతం 30 శాతం ఆఫ్ లో ఇస్తున్నారు. అంతే కాకుండా 3000లకు పైగా మీరు షాపింగ్ చేస్తే మరో 500 ఫ్రీ గా ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఇక క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. పేటిఎం, ఫోన్ పే వంటి వాటితో నగదు చెల్లింపులు చేస్తే… 600 నుంచి 1500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు వెంటనే చెల్లించే విధంగా ఇస్తున్నారు.
అలాగే మ్యాక్స్ లో కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటున్నాయి. రిలయన్స్ ట్రెండ్స్ లో కూడా ఈ ఆఫర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా ఎక్కువ బ్రాండ్లు అందిస్తున్నారు. డబ్బున్న వాళ్ళు బ్రాండ్ల పేరుతో ఈ షో రూమ్స్ కే వెళ్ళాలి అన్నట్టు వ్యవహరిస్తారు. కాని ఆదాయం తక్కువగా ఉన్న వారు తల్లి తండ్రుల మీద ఆధారపడే వారు… బట్టల కొనే విషయంలో పది షాపులు తిరగండి… గతంలో మాదిరి ఒక షాపు కాదు… ఇప్పుడు అనేక షోరూమ్స్ మార్కెట్ లో మనకు తక్కువ ధరకే మంచి బట్టలు అందిస్తున్నాయి… అయితే బోలెడన్ని ఆఫర్లు. అందుకే తొందర పడకుండా జాగ్రత్త పడండి.