పుదీనాతో మరెంత అందంగా మారండి..!

-

పుదీనా వల్ల కేవలం మంచి రుచి మాత్రమే కాదు. అందానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖం మీద ఉండే పింపుల్స్, మచ్చలు వంటి వాటిని తొలగించడానికి ఇది ఎంతో బాగా సహాయ పడుతుంది. అయితే ఈ రోజు పుదీనా వల్ల అందానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

పుదీనలో విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అదే విధంగా ఇది చర్మానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. యాక్నీ, పింపుల్స్ వంటి సమస్యలను తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ గా, ఫ్రెష్ గా ఉంచుతుంది. పుదీనా తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఈ విధంగా ప్రయత్నం చేయండి:

యాక్నీ తొలగిపోవడానికి పుదీనా ఫేస్ ప్యాక్:

కావలసిన పదార్థాలు:

10 పుదీనా ఆకులు
కలబంద గుజ్జు

తయారు చేసుకునే పద్ధతి:

ముందు పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి.. ఆ తర్వాత దానిని మెత్తగా నూరండి. దీనిలో అలోవెరా జెల్ వేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి ముఖాన్ని కడిగేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల యాక్నీ తొలగిపోతుంది.

చర్మం అందంగా మారాలంటే ఇలా చేయండి:

కావలసిన పదార్థాలు:

10 పుదీనా ఆకులు
ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు
చిటికెడు పసుపు

తయారు చేసుకునే విధానం:

మీ చర్మం కాంతివంతంగా మారాలి అంటే బొప్పాయి గుజ్జులో పుదినా ఆకులు వేసి బాగా మిక్స్ చేసి దానిలో కొద్దిగా పసుపు వేసి ముఖానికి అప్లై చేసుకోండి. 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం మరింత అందంగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version