‘బెదురులంక 2012’ సినిమా నుంచి టీజర్ రిలీజ్!

-

గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథతో మనముందుకు తాజాగా కార్తికేయ హీరోగా ‘బెదురులంక 2012’ సినిమా రాబోతుంది. రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకి, క్లాక్స్ దర్శకత్వం వహించాడు. కార్తికేయ జోడీగా నేహాశెట్టి అలరించనుంది. ఇంతవరకూ పోస్టర్స్ ను వదులుతూ వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన టీమ్ సభ్యులు, కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ .. లంకల గ్రామాలకి చెందిన ‘బెదురులంక’ అనే గ్రామంలో 2012లో నడిచే ప్రేమకథ.

ఆ సమయంలో యుగాంతం జరగనున్నట్టుగా జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారంతో ముడిపడిన సంఘటనలతో ఈ సినిమా సాగుతుందనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. హీరో, హీరోయిన్ ప్రేమవ్యవహారం .. డ్రామా కంపెనీకి సంబంధించిన సందడిని కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది. లవ్, యాక్షన్, కామెడీపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకులను అల్లారించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version