మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను కొల్లడగోడుతుంది. ఈ నెల 25 న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగ ప్రస్తుతం ఈ సినిమా టికెట్లు.. ఆన్ లైన్ లో ప్రీ బుకింగ్ గా అందుబాటులో ఉన్నాయి. కాగ ఈ ప్రీ బుకింగ్ లో ఆర్ఆర్ఆర్ రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే అమెరికాలో ప్రీ బుకింగ్ ల ద్వారా 1.5 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకుంది.
దీంతో అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగ తాజా గా ఆర్ఆర్ఆర్ మరో రికార్డును సృష్టించింది. సింగపూర్ లో ప్రీ బుకింగ్స్ లో ఘనత సాధించింది. ఆన్ లైన్ లో ప్రీ బుకింగ్ గా టికెట్లను అందుబాటులో ఉంచిన క్షణాల్లోనే టికెట్లు ఖాళీ అయిపోతున్నాయి. ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లును కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
దీంతో సింగపూర్ లో ఇప్పటి వరకు అమ్ముడు పోయిన ప్రీ బుకింగ్ తో ఆర్ఆర్ఆర్ సినిమా టాప్ – 10లోకి వెళ్లింది. సింగపూర్ లో ఎక్కువగా తమిళ సినిమాలు ఆడుతాయి. కానీ మొదటి సారి తెలుగు సినిమాకు ఇంతటి ఆదరణ లభిస్తుంది. ఓవర్సీస్ లోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో నూ ఆర్ఆర్ఆర్ రికార్డుల మోత మోగిస్తుంది.
టికెట్ రేట్లు భారీగా పెరిగినప్పటికీ.. ప్రీ బుకింగ్ లో ప్రేక్షకులు తగ్గేదేలా అంటూ దూసుకెళ్తున్నారు. బాక్సాఫీస్, ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్ దూకుడు చూస్తే.. మొదటి రోజు ఆర్ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలోనే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.