టిక్ టాక్ చేసే ముందు, అర్జెంట్ గా ఇది చేయండి…!

-

టిక్ టాక్’ ఈ రోజుల్లో దీనికి ఇష్టపడని వారు లేరు. కాదు కాదు దీనికి బానిసలు అవని వారు లేరు. ఇష్టం కాస్త బానిస గా మారిపోయి ఇక దానితోనే తిండి నిద్ర. ఉద్యోగాలు లేవు ఏమి లేవు, చదువులు అంత కన్నా లేవు. శ్రీవారికి వంట వండాల్సిన శ్రీమతి కూడా టిక్ టాక్ కి బానిస అయి వంట గదికి వెళ్ళకుండా బెడ్ రూమ్ లోనే ఉండిపోతుంది. అయితే ఇప్పుడు ఈ టిక్ టాక్ వలన పెద్ద సమస్యే వచ్చి పడింది.

టిక్ టాక్ ని ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి లాగ్ అవుట్ చేయకుండా అలాగే వాడుతున్నారు కొందరు. మన ఫోన్ ఏ కదా అని చెప్పి లాగ్ అవుట్ చేయకుండా అలాగే ఉండిపోతున్నారు. అది కొంపలు ఆర్పెస్తుందని అంటున్నారు టేక్ నిపుణులు. టిక్ టాక్‍‌ ద్వారా ఓ బగ్‌ని ఎంటర్ చేసిన హ్యాకర్లు, దాని ద్వారా అక్కడి మీ మొబైల్ కి వచ్చి, కాంటాక్ట్ నంబర్లు, లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, ఫొటోలూ, వీడియోలూ అన్నింటినీ లాగేస్తున్నారు హ్యాకర్లు.

ఈ బగ్ ద్వారా అమ్మాయిలు తీసుకునే సెల్ఫీలను కూడా దొంగతనం చేసి వాటిని మార్ఫ్ చేస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన టిక్ టాక్ యాజమాన్యం, భద్రతను పెంచింది. అయినా సరే కొందరిని ఈ సమస్య వాళ్ళకు తెలియకుండా వెంటాడుతుంది. కాబట్టి వెంటనే యాప్ ని అన్ ఇన్స్టాల్ చేసి రీ ఇన్స్టాల్ చేయాలని లేదా రీ లాగిన్ అవ్వాలని లేకపోతే మాత్రం మీరు ఇబ్బందులు పడతారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version