బాలయ్య ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా’ డైలాగ్ పుట్టిందిలా..!

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఉండే డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆయన పిక్చర్స్ లో ఉండే సింగిల్ లైనర్స్ చాలా క్యాచీగా ఉంటాయి. ఉదాహరణకు ‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా’ అని బాలయ్య ఇచ్చే మాస్ వార్నింగ్ డైలాగ్ విని బాలయ్య అభిమానులు థియేటర్లలో సందడి చేస్తుంటారు.

ఇటువంటి డైలాగ్స్ బాలయ్య సినిమాల్లో ఉండాలని ప్రతీ బాలయ్య అభిమాని కోరుకుంటాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘నరసింహనాయుడు’ చిత్రంలోని ఈ డైలాగ్ బాలయ్య చెప్పినపుడు థియేటర్లు ఊగిపోయాయి. అయితే, ఈ డైలాగ్ ఎలా పుట్టిందో ఓ ఇంటర్వ్యూలో డైలాగ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ వివరించారు. సీనియర్ ఎన్టీఆర్ కు ఈ డైలాగ్ తో ఉన్న సంబంధం గురించి పేర్కొన్నారు పరుచూరి.

సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘నా దేశం’ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ రచయితగా పని చేశారు. ఈ చిత్రంలో చివరన ఒకే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఇంకో ఫైట్ సీన్ పెట్టాలని దర్శకుడు అనుకున్నారు. కానీ, ఈ విషయం ఎన్టీఆర్ కు చెప్పే ధైర్యం చేయలేదు. దాంతో ఈ విషయం చెప్పే బాధ్యత పరుచూరి గోపాలకృష్ణపైన పడింది.

అలా ఆయన ఈ విషయం ఎన్టీఆర్ కు చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ ‘సత్యనారాయణతో ఫైట్ ఉంటే చెప్పండి..అంతే కానీ నేను గట్టిగా కన్నెర్ర చేస్తే వాళ్లు గుండె ఆగి చస్తారు’ వారితో ఏంటి ఫైట్ అని ఎన్టీఆర్ అన్నారట. అలా ఎన్టీఆర్ తన నోటి నుంచి చెప్పిన మాటలను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా’ అనే డైలాగ్ రాసినట్లు వివరించారు.

బాలయ్య ప్రస్తుతం చేస్తున్న తన 107 వ సినిమా (NBK 107) ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కూడా సినీ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ కు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version