బెజవాడ పాలిటిక్స్: ‘ఫ్యాన్’కు తమ్ముళ్లే ప్లస్?

-

ఏపీలో అధికార వైసీపీలోనే కాదు…ప్రతిపక్ష టీడీపీలో కూడా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఆధిపత్య పోరు వల్ల…పలు నియోజకవర్గాల్లో మైనస్ లో ఉన్న వైసీపీకి ప్లస్ అవుతుంది. ఇలాంటి పరిస్తితి విజయవాడలో కూడా ఉందని చెప్పొచ్చు. విజయవాడలో టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది…గత ఎన్నికల్లో కూడా జగన్ గాలిలో విజయవాడ నగరంలోని తూర్పు అసెంబ్లీ సీటుని, ఎంపీ సీటుని టీడీపీ కైవసం చేసుకుంది.

ysrcpandtdp

ఇక విజయవాడ సెంట్రల్, వెస్ట్ సీట్లని వైసీపీ తక్కువ మెజారిటీలతో కైవసం చేసుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా విజయవాడలో టీడీపీ బలం ఏ మాత్రం తగ్గలేదు. అసలు వైసీపీ..టీడీపీ బలాన్ని తగ్గించలేకపోయింది. కానీ టీడీపీలో ఉండే లుకలుకలే వైసీపీకి బాగా ప్లస్ అయ్యాయి. మొదట నుంచి విజయవాడలో తమ్ముళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి.

ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాలకు ఏ మాత్రం పొసగడం లేదనే సంగతి తెలిసిందే. ఎవరికి వారు సెపరేట్ గా రాజకీయం చేస్తూ ఉంటూ వస్తున్నారు. ఆఖరికి బుద్దాని…ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ గా, కేశినేనిక విజయవాడ వెస్ట్ సమన్వయకర్తగా నియమించిన విభేదాలు తగ్గలేదు. ఇక వీరి మధ్య రచ్చ వల్లే…విజయవాడ కార్పొరేషన్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది…బలంగా ఉన్నచోట కూడా టీడీపీ ఓడిపోయింది. అంటే టీడీపీలో ఉన్న విభేదాలు వైసీపీకి బాగా ప్లస్ అయ్యాయి.

అయితే ఇప్పటికీ టీడీపీలో రచ్చ తగ్గడం లేదు..ఇదే క్రమంలో ఎంపీ కేశినేని సైతం..టీడీపీకి దూరం జరుగుతున్నారు.టీడీపీ అధిష్టానం తన శత్రువులని ప్రోత్సహిస్తే..తాను టీడీపీ శత్రువులతో కలవాల్సి వస్తుందని అంటున్నారు…పైగా తనకు పార్టీలతో సంబంధం లేదంటున్నారు. అంటే టీడీపీతో సంబంధం లేదన్నట్లే పరోక్షంగా చెబుతున్నారు. త్వరలోనే ఆయన పార్టీని కూడా వదిలేలా ఉన్నారు. ఇలా బెజవాడలో తమ్ముళ్ళ మధ్య రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ వల్ల వైసీపీకి ఇంకా ప్లస్ అవుతుంది..ఎన్నికల్లోపు ఈ రచ్చ తగ్గకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో విజయవాడలో వైసీపీని ఆపడం కష్టమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version