ఫిబ్రవరి 05న వైసీపీ ఫీజుపోరు.. పోస్టర్ రిలీజ్

-

ఫిబ్రవరి 05న వైసీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ ను వైసీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు తదితర నేతలు పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యాసంస్థలు.. విద్యార్తులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో విద్యార్తులు కూలీగా మారిపోతున్నారన్నారు.

2014-19లో కూడా చంద్రబాబు అలాగే బకాయిలు పెడితే వైఎస్ జగన్ వచ్చాక రిలీజ్ ఇచ్చారు. చంద్రబాబు వ్యవహార శైలి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. విద్యార్తులకు అండగా వైసీపీ ఉంటుంది. గడిచిన 8 నెలల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు 420 అంటూ జనం విమర్శలు చేస్తున్నారు. వెంటనే ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు ఇవ్వకపోతే పోరాటం తీవ్రరూపం చేస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version