డ్రెస్సింగ్ రూమ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కలిసి మందు తాగలేదు … !

-

నిన్న రాత్రి నెలన్నర రోజుల పాటు జరిగిన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ ను గెలుచుకు సిరీస్ ను సక్సెస్ ఫుల్ గా 2 – 2 తో సమం చేసింది. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా … ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలాఎపు వారితో కలవలేదట. కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ కి ఆస్ట్రేలియా ఆటగాళ్ళు వెళ్లి చాలా సేపు వారితో ముచ్చటించారట. కానీ ఒక బ్రిటిష్ పత్రిక ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ లోనే మందు తాగారని వైరల్ చేశారు. ఈ వార్తపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించారు. మేము మ్యాచ్ అనంతరం మందు తాగిన విషయం వాస్తవమే. కానీ మేము అందరం నైట్ క్లబ్ కు వెళ్లి అందరం కలిసి మందు తీసుకున్నాం.. మీరనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు డ్రెస్సింగ్ రూమ్ లో మందు తాగలేదని క్లారిటీ ఇచ్చారు.

 

ఇంకా మా మధ్యన మ్యాచ్ కు సంబంధించి ఎన్ని గొడవలు జరిగినా ? ఎంత సీరియస్ అయినా మేమంతా ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ వివరణతో ఈ వార్తకు ఇక ఫుల్ స్టాప్ పడినట్లే !

Read more RELATED
Recommended to you

Exit mobile version