రెండు వారాల క్రితం థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలైన మల్టీ స్టారర్ మూవీ బ్రో గురించి తెలిసిందే. విడుదలకు ముందు ఎన్నో అంచనాలతో బరిలోకి రాగా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ సినిమా వసూళ్లు తగ్గడం లేదని రోజుకో న్యూస్ సినీ వర్గాల నుండి వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రాజకీయంగా కొన్ని వైసీపీకి వ్యతిరేక డైలాగులు ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో సినిమా మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా ఫలితం గురించి నిర్మాతలలో ఒకరు అయిన టీజీ విశ్వ ప్రసాద్ కొన్ని కామెంట్ లు చేశారు. ఈయన మాట్లాడుతూ బ్రో మూవీ డిజాస్టర్ అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలపై తగిన విధంగా రిప్లై ఇచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది అన్నది ప్రేక్షకులు తీర్పును ఇచ్చేశారు.. ఇక కలెక్షన్ ల లెక్కల గురించి మేము అందరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు విశ్వప్రసాద్. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అన్న విషయం మేము ఏజెన్సీ లకు మాత్రమే చెబుతామని క్లారిటీ ఇచ్చారు.