లవంగం ఎందులో వేసిన మంచి రుచి వస్తుంది. ముఖ్యంగా కొన్ని వంటలలో ఇది లేకపోతే ఫ్లేవర్ ఏ ఉండదు. దీనిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. పంటి నొప్పిని, గొంతు నొప్పిని తొలగించడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని కూడా ఇది చిటికె లో తొలగిస్తుంది.
లవంగం లో విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలేట్, రైబోఫ్లెవిన్, విటమిన్ ఎ ఉంటాయి. దీనిలో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. రోజులో ఎప్పుడైనా సరే లవంగాలను తీసుకోవచ్చు.
ఒక వేళ కనుక రోజూ నిద్ర పోయే సమయం లో దీన్ని తీసుకుంటే దీని వల్ల కలిగే బెనిఫిట్స్ మరిన్ని ఉంటాయి. త్వరగా సమస్యలని కూడా రాత్రి పూత తీసుకోవడం వలన తగ్గి పోతాయి. ప్రతి రోజు రాత్రి రెండు లవంగాలని నిద్ర పోయే తీసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళు తాగండి.
దీని వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా యాక్నీ ని తొలగించ వచ్చు. అలానే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాన్స్టిపేషన్, డయేరియా వంటి సమస్యలు తొలగి పోతాయి. అలానే బ్యాక్టీరియాని కూడా ఇది తొలగిస్తుంది. దగ్గు, రొంప, సైనస్, ఆస్తమా కూడా ఇలా తీసుకుంటే తొలగిపోతుంది.