దేశంలో రెండవ వేవ్ కరోనా వైరస్ కేసులు భారీ ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో కోవిడ్ -19 నివారణా మార్గాల గురించి చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కరోనా నేపధ్యంలో అనేక రాష్ట్రాలు / యుటిలు కేసులను అదుపు చేయడానికి లాక్ డౌన్ ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల వారు రాత్రి కర్ఫ్యూలు మరియు వారాంతపు లాక్‌డౌన్లను కూడా విధించారు, ఇతర రాష్ట్రాల నుండి, ముఖ్యంగా హాట్‌స్పాట్ రాష్ట్రాల నుండి వస్తున్నా ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు.
ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఈ సీజన్ లో మనం మొదటి వేవ్ యొక్క పరిమితులను దాటామని మోడీ పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం … ముఖ్యంగా ప్రజలు దీనిని తేలికగా తీసుకుంటున్నారని, కొన్ని రాష్ట్రాల్లో పరిపాలన చేసే వారి నిబద్ధత లోపించిందని అన్నారు. ఇంతకుముందు మహమ్మారిని ఎదుర్కోవటానికి మనకు మౌలిక సదుపాయాలు లేవు అందుకే మనం లాక్ డౌన్‌ను ఒక సాధనంగా ఉపయోగించాల్సి వచ్చింది … కానీ ఈ రోజు మనకు లాక్‌డౌన్ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. నైట్ కర్ఫ్యూ పెడితే సరిపోతుందన్న ఆయన దీనిని నైట్ కర్ఫ్యూ అని పిలవడానికి బదులు మనం దానిని “కరోనా కర్ఫ్యూ” అని పిలవాలని అన్నారు.