పరగడుపున నీళ్లు తాగుతున్నారా.. ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..!

-

మనం బ్రతకడానికి సరైన ఆహారం మాత్రమే తీసుకోవడం కాదు దానికి సరిపడా నీటిని కూడా తీసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తినడానికి, తాగడానికి కూడా సమయం దొరకడం లేదు. దీని వల్ల మనకు తెలీకుండా మనమే అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి మన ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి నీటిని తాగే అలవాటు చేసుకుందాం. మనం ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాసు నీళ్ళు తాగడం చాలా మంచిది. అలా గ్లాసు నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.

మానవ శరీరంలో 50 శాతం కంటే ఎక్కువ నీటి శాతం కలిగి ఉంటుంది. కాబట్టి శరీరం సరిగ్గా పనిచేయడానికి మంచి నీరు ఎక్కువ తీసుకోవడం మంచిది.

రాత్రి సమయంలో మనం దాదాపు 6 నుంచి 8 గంటల వరకు ఎటువంటి నీటి వినియోగం లేకుండా నిద్రపోతూ ఉంటాము. అలా ఉండడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. అందువల్ల ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీటిని తీసుకోవడం వల్ల తిరిగి మన శరీరం రీహైడ్రేషన్ స్థితికి వస్తుంది. దీని ద్వారా రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పనులు చేసుకోవచ్చు.

మన మెదడుకు దాదాపు 70 శాతం పైగా నీటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే డీహైడ్రేషన్ అవుతుందో అప్పుడు మెదడు పనితీరులో హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి దీని ప్రభావం మన జ్ఞాపకశక్తి మీద పడుతుంది. అందుకే ఉదయం లేవగానే నీరు తాగడం మంచిది.

పరిగడుపున నీరు తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుందని దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. చూశారుగా పరగడుపున నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, మరి ఇంకేందుకు ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.. ఆరోగ్యంగా, అందంగా కనిపించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version