ఈ రోజు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. పాలకుర్తి నియోజవర్గం పరిధిలోని కొడకండ్లలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో 5000 మ౦ది రైతులతో సమావేశంలో పాల్గొంటారు. సభ అనంతరం కొడకండ్లలోనే మధ్యాహ్న భోజనం చేయనున్న సీఎం ఆ తరువాత హైదరాబాద్ పయనం కానున్నారు.
రైతులను సంఘటిత పరిచేందుకు 2017 సెప్టెంబర్ 15న, సిఎం, రైతుబంధు సమితులకు రూపకల్పన చేశారు. అలా రాష్ట్రంలో 10,733 గ్రామాల్లో రైతుబంధు సమితులు ఏర్పడ్డాయి. గ్రామ స్థాయిలో 15మంది రైతులతో, మండలస్థాయిలో 24 మందితో, జిల్లాస్థాయిలో 24 మందితో, రాష్ట్రస్థాయిలో 42 మంది సభ్యులతో సమితులు ఏర్పడ్డాయి. మొత్తం 1 లక్షా 61 వేల మంది రైతులు సభ్యులుగా రైతు సమన్వయ సమితులు పనిచేస్తున్నాయి. రూ.573 కోట్లతో 2,604 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మాణం జరిగింది. రైతులు, వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి సభ్యులు, శాస్త్రవేత్తలు సమావేశమయ్యేలా ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిచింది. ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా విభజించి, ప్రతీ క్లస్టర్ లో రూ.22 లక్షల ఖర్చుతో ఒక రైతు వేదిక ఏర్పడింది.