ఈరోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంగా ఎవరూ లేరు. అందరికీ ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంది. వీటన్నింటికి ముఖ్యకారణం..సరైనా ఆహారం లేకపోవడం, కంటి నిండా నిద్రలేకపోవటం..జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం. ఈ రకమైన ఫుడ్‌కారణంగా.. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిన లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఈ దుష్ప్రభావాలన్నింటి కారణంగా గుండెలయ మారుతుంటుంది. ఈ సమస్యలకు పెరట్లో పండే సొరకాయ చక్కటి పరిష్కారం అని మీకు తెలుసా. చాలామందికి సొరకాయ నచ్చదు. తినటానికి అసలు ఇష్టపడరు. కానీ అందులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు కచ్చితంగా తినలానుకుంటారు. చూద్దాం అవి ఏంటో..
- దేహంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సమర్థంగా పని చేస్తుంది.
- సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్‌లు కూడా ఉంటాయి.
- సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.
- సలాడ్, కూర, హల్వా చేసుకుని కూడా తినవచ్చు.
- జుట్టు తెల్లబడిన టీనేజ్ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. తిరిగి పూర్వపు స్థితికి కూడా వస్తుంది.
- ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమమవుతుంది.
- ఇందులో సహజసిద్ధంగా ఉన్న మత్తు కలిగించే గుణం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటు అలసిన దేహం సాంత్వన పొందుతుంది కూడా.
- హైబీపీ ఉన్న వాళ్లు వారానికి మూడుసార్లు ఈ రసం తాగితే రక్తప్రసరణ అదుపులోకి వస్తుంది.
- గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది.
- సొరకాయ తింటే మంచి నిద్రపడుతుందట.
- ఇది సొరకాయలు పండే కాలం. హైబీపీ ఉన్న వాళ్లు ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- బాటిల్ గార్డ్ బీపీ గార్డ్ అని కూడా నిర్ధరణ అయింది కూడా.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న సొరకాయను ఈ సీజనల్ బాగా లాగించేయండి. అందులోని దీని ధరకూడా వేరే కాయగూరలతో పోల్చుకుంటే..చాలా చవక. తక్కువ ధరకే దొరికే మంచి కాయ ఇది. ఇంతకీ మీకు సొరకాయ ఇష్టమేనా.!