చింత పండు నుంచి గింజలు తీసేసి వాటిని పారేస్తూ ఉంటాము. కానీ వాటి వల్ల చాలా మేలు కలుగుతాయి. దీనిని కనుక మీరు పూర్తిగా చూశారంటే… ఆ గింజలు ఎప్పుడు పారేయరు. ఇక దీని వల్ల కలిగే మేలు కోసం చూస్తే… చింత పిక్కల లో క్యాల్షియం, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. చింత గింజలు కనుక తీసుకుంటే కీళ్ల నొప్పుల్ని కూడా తగ్గించ వచ్చు.
అంతే కాదండి వయస్సు పెరిగిన తర్వాత మహిళలు శరీరం లో క్యాల్షియం తగ్గుతూ ఉంటుంది కనుక వీటిని ఉపయోగిస్తే ఎముకల బలహీనత తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు దీనిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కొవ్వు కరిగిపోతుంది. చింత గింజలు వేపుకుని కూడా తినొచ్చు. అలాగే వీటిని పొడి చేసుకుని కూడా ఉపయోగించ వచ్చు.