ఐదు అసెంబ్లీ స్థానాలు.. ఏ పార్టీ గెలుస్తుందో..!

-

పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి (కేంద్ర పాలిత ప్రాంతం)లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలు ఎంతో దూరం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎందుకంటే పుదుచ్చేరి తప్ప.. మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని, పశ్చిమ బెంగాల్‌లో ఏ మాత్రం తగ్గని మమత బెనర్జీ, తమిళనాడులో జయ, కరుణల మరణంతో మారిన రాజకీయాలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అస్తిత్వ పోరాటాల మధ్య ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయో వేచి చూడాల్సిందే.

VOTE

పశ్చిమ బెంగాల్..
ప్రస్తుతం అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ వైపే ఉన్నాయి. ఇప్పటికే ఈశాన్య భారత్‌లో బలపడిన బీజేపీ కన్ను ఇప్పుడు తూర్పు రాష్ట్రాలపై పడింది. అందుకే బెంగాల్‌లో పట్టు సాధించేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పదేళ్ల పాలనను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, మరో వైపు ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా బీజేపీపై విరుచుకుపడుతోంది. బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తమిళనాడు..
తమిళనాడు రాజకీయాల్లో కూడా వాతావరణం వేడీగా ఉంది. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కరుణానిధి వారసుడైన స్థాలిన్ డీఎంకే పార్టీని నడిపిస్తున్నాడు. కానీ అన్నాడీఎంకే పార్టీకి వారసులు లేకపోవడంతో పార్టీ బలహీనపడింది. జయలలిత చెల్లెలు శశికళ జైలు నుంచి విడుదల కావడంతో అంతర్గత పోరు మరింత పెరిగింది.

అసోం..
అసోంలో బీజేపీ నేరుగా కాంగ్రెస్‌తో పోటీ పడనుంది. 2016 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ చట్టం అమలు, మైక్రో ఫైనాన్స్ రుణాలు, ఆత్మహత్యలు తీవ్ర వ్యతిరేక పెరిగింది. ఈ సమయంలో అసోంలో ఎవరి పాలన వస్తుందో చూడాలి.

కేరళ..
40 ఏళ్లుగా కేరళలో ఓ సారి కమ్యూనిస్టు ఆధ్వర్యంలోని ఎల్‌డీఎఫ్ కూటమి గెలిస్తే.. మరోసారి కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి గెలుస్తోంది. బెంగాల్‌లో మిత్ర పక్షాలుగా ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ.. కేరళకు వచ్చే సరికి బద్ధ శత్రువులుగా మారారు. ఈ సారి ఎవరి గెలుపు ఉంటుందో ఇంకొద్ది రోజులు వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version