కరోనా సమయంలో తిప్పతీగ వలన ఎన్నో లాభాలు.. డెంగ్యూ మొదలు ఆర్థరైటిస్ సమస్యలు కూడా వుండవు..!

-

తిప్పతీగ వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు కలుగుతాయి. ఆయుర్వేద మందులలో కూడా తిప్పతీగను ఎక్కువగా వాడతారు. చాలా సమస్యలను ఇది తొలగిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి సమయంలో తిప్పతీగ చాలా ఉపయోగకరం. డెంగ్యూ, చికెన్ గునియా, జ్వరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. డెంగ్యూ మొదలు ఆర్థరైటిస్ సమస్యలు కూడా వుండవు.

అలాగే వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా తిప్పతీగ పెంపొందిస్తుంది. అయితే తిప్పతీగను తీసుకునేటప్పుడు ఒక కప్పు కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. అయితే ఈ విధంగా మీరు తిప్పతీగ తో డికాషన్ చేసుకుని తాగితే అద్భుతమైన లాభాలను పొందుతారు. మరి తిప్పతీగ డికాషన్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు :

రెండు కప్పులు నీళ్లు
రెండు తిప్పతీగ కొమ్మలు చిన్నవి
రెండు దాల్చిన చెక్కలు
ఐదు తులసి ఆకులు
ఎనిమిది పుదీనా ఆకులు
రెండు టేబుల్ స్పూన్లు తేనె
అర టీ స్పూన్ పసుపు
ఒక టీ స్పూన్ మిరియాల పొడి
అల్లం ముక్క చిన్నది

తయారు చేసుకునే విధానం :

రెండు కప్పులు నీళ్లు తీసుకుని పాన్ లో వేసి మరిగించండి. ఆ తర్వాత తేనే తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకుని నీళ్ళు సగం అయ్యే వరకు కూడా ఉంచండి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తేనే వేసుకుని తీసుకోండి. దీనిని తీసుకుంటే చక్కటి ఫలితాలు పొందొచ్చు. అలానే చాలా సమస్యలకి చెక్ పెట్టేయచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version