SBI: ఈ ఇన్సూరెన్స్ పాలసీ తో ఎన్నో బెనిఫిట్స్..!

-

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాతా ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. రూ.40 లక్షల వరకు ఇన్‌స్టంట్ లైఫ్ కవర్‌ తో ఇన్స్యూరెన్స్ ని తీసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పేరుతో అందిస్తున్న ప్రత్యేక పాలసీ ఇది. ఎస్‌బీఐ కస్టమర్లు ఎవరైనా ఈ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు అని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది. ఇది గ్రూప్, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ.

 

పైగా ఎస్‌బీఐ యోనో నుండే సులభంగా ఎస్‌బీఐ లైఫ్ సంపూర్ణ్ సురక్ష పాలసీ తీసుకోవచ్చు. ఇక ఈ పాలసీ వలన కలిగే లాభాలు ఏమిటి అనే విషయానికి వస్తే… ఈ పాలసీ తీసుకున్న వారికి అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా మద్దతుగా నిలుస్తుంది ఈ పాలసీ. ఇక ఎంత పాలసీ తీసుకోవచ్చు అనేది చూస్తే…

కనీసం రూ.1,00,000 నుంచి రూ.40,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. అయితే పాలసీ బట్టి ప్రీమియం ఉంటుంది. ప్రతీ ఏటా ప్రీమియం కస్టమర్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. దీనిని తీసుకోవాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి.

గరిష్ట వయస్సు 55 ఏళ్లు. పాలసీ టర్మ్ ఏడాది మాత్రమే. దీని కోసం మీరు యోనో లో ఇన్సూరెన్స్ ని ఓపెన్ చేసి Buy a Policy ఆప్షన్ మొయిద క్లిక్ చేసి… SBI Life – Sampoorn Surakasha సెలెక్ట్ చేసి సమ్ అష్యూర్డ్, పుట్టిన తేదీ, నామినీ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తరువాత అక్కడ వున్న వివరాలని ఫిల్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ కూడా చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version