ఈ మ్యూచువల్ ఫండ్స్‌తో అదిరే లాభాలు..!

-

మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చెయ్యాలని మీరు అనుకుంటున్నారా..? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదో తెలియడం లేదా..? అయితే తప్పక మీరు వీటిని చూడాలి. దీనితో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.

మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డబ్బులు పెడితే మంచి రాబడి వస్తుంది. వీటిలో డబ్బులు పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు చెప్పడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు.

మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టే వారు తప్పక కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అలాగే అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒకే రకమైన రాబడిని అందించలేవు అని తెలుసుకోండి. అందుకే మీరు డబ్బులు పెట్టడానికి ముందు మంచి మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవాలి.

గత సంవత్సరం బ్యాంకింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అదిరిపోయే రాబడిని అందించాయి. వ్యాల్యూ రీసెర్చ్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే ఈ ఫండ్స్ సగటున 50 శాతానికి పైగా రాబడిని ఇచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లకి మంచి లాభాలు వచ్చాయి.

నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ ఏడాదిలోనే 76 శాతం రాబడిని ఆఫర్ చేసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఫండ్ 74 శాతం, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ 71 శాతం ఇచ్చాయి. అదే విధంగా యూటీఐ బ్యాంకింగ్ ఫండ్ 66 శాతం, కోటక్ పీఎస్‌యూ బ్యాంక్ 67 శాతం, ఎస్‌బీఐ నిఫ్టీ బ్యాంక్ రాబడిని అందించాయి.

ఇది ఇలా ఉంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాన్, కోటక్ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్, ఎస్‌బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ బ్యాంక్, యూటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ లో 50 శాతానికి పైగా రాబడిని ఇవ్వడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version