ఆపిల్ జ్యూస్ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు…!

-

ఆపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలిసిందే. కాని ఆపిల్ పళ్ళ కన్నా, ఆపిల్ జ్యూస్ ఇంకా మంచిదని రకరకాల వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలను సమకూరుస్తుంది. రోజు ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల మతి మరుపు వ్యాధి రాకుండా ఉంటుంది. రోజులో రెండు గ్లాసుల జ్యూస్ తాగడం వల్ల శరీరంలో బీటా అమైలిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

ఈ ప్రోటీన్ మెదడులో కొన్ని రకాల రంధ్రాలను ఏర్పరచడం వల్ల మతి మరుపు వ్యాధి వస్తుంది. ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ లో 100 కేలరీలు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దీనిలో కొవ్వు పదార్థాలు ఉండక పోవడం వల్ల శరీర బరువు ని అదుపులో ఉంచుతుంది. ఇంకా ఈ జ్యూస్ తాగడం వల్ల కోలన్, చర్మ , బ్రెస్ట్ క్యాన్సర్ లకు వ్యతిరేకంగా పని చేస్తుంది.ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే మెదడు చురుగ్గా పని చేస్తుంది.

శరీరానికి కావలసిన విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి సరైన శక్తిని ఇస్తుంది. ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ తాగితే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరలలో కొవ్వు ఏర్పడటాన్ని నిషేధించి, గుండె పోటు రాకుండా చేస్తుంది. ముత్ర పిండాలను, కాలేయాన్ని శుభ్ర పరుస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఆపిల్ జ్యూస్ లో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రక్త హీనతను నివారిస్తుంది. ఏది ఏమైనా రోజు  ఒక ఆపిల్ తనడం వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం రాదు అని నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version