పెన్షన్ కోసం 20 కిలోమీటర్లు నడిచిన వృద్దులు …!

-

మెదక్‌ జిల్లా చిల్‌పచెడ్‌ మండలం బండపోతుగల్‌ గ్రామానికి చెందిన వృద్ద దంపతులు మల్లయ్య, పోచమ్మల కు వారికి వచ్చే పెన్షన్ డబ్బులే జీవనాధారం. మల్లయ్య అంధుడు కావడం, పైగా కూతురు భర్తను కోల్పోయి ఆమె కూడా వీరి వద్దనే ఉండటంతో పోషణ కష్టం అవుతుంది. వికలాంగులకు ఇచ్చే రూ.3 వేలు పింఛను మల్లయ్యకు మంజూరు కాలేదు. కనీసం దీనిపై వారికి అవగాహన లేదు.

ఆ పెన్షన్ డబ్బులను తీసుకునేందుకు మండుటెండలో 20 కిలోమీటర్లు కాలినడకన కౌడిపల్లి బ్యాంకు శాఖకు వచ్చారు. తీరా చూస్తే పనివేళలు పూర్తయి బ్యాంకు మూసేశారు, తిరిగెల్లేందుకు వారికి ఓపిక లేదు. ఒక్క అడుగు కూడా వేసే ఓపికా లేక రాత్రికి రోడ్డు పక్కన నిద్రపోయారు. వీరి అవస్తను చూసి నర్సాపూర్‌ పోలీసులు చలించిపోయారు.

సీఐ నాగయ్య, ఎస్ఐలు రాజశేఖర్‌, సత్యనారాయణ వారి వివరాలు తెలుసుకుని బుధవారం రాత్రి స్ట్రేషన్‌కు తీసుకెళ్లి అన్నం పెట్టి వారికి అక్కడే బస ఏర్పాటు చేశారు. గురువారం ఉదయాన్నే బ్యాంకులో వారికి పింఛను డబ్బు ఇప్పించి,నర్సాపూర్‌లో బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు కొనిచ్చారు. అంతే కాకుండా ఖర్చులకి రూ.వెయ్యి చేతిలో పెట్టి తమ వాహనంలోనే వారి గ్రామమైన బండపోతుగల్‌కు పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version