ఈ ఏడాది ఆ ఇన్నింగ్స్ కి ఫిదా అయిన క్రికెట్ ఫాన్స్…!

-

2019 ఏడాది క్రికెట్ కి వివాదాలను ఎక్కువగానే ఇచ్చింది. జ్ఞాపకాలతో పాటు కొంత మంది ఆటగాళ్లకు ఈ ఏడాది కలిసి రాలేదు. మరి కొంత మందికి కలిసి వచ్చింది.

డోప్ టెస్ట్ లో దోషిగా తేలిన యువ ఆటగాడు పృథ్వీ షా… నిషేధానికి గురి కావడం, దగ్గు మందు కారణంగానే అది జరిగినట్టు తేలడం వివాదాస్పదంగా మారింది.

ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్ లో ఆసిస్ కీలక ఆటగాడు స్టీవ్ స్మిత్… బ్యాటింగ్ టెస్ట్ క్రికెట్ లోనే చిరస్థాయిగా మిగిలిపోతుంది. వెయ్యికి పైగా పరుగులు ఆ సీరీస్ లో చేసాడు. అదే సీరీస్ లో మూడో టెస్ట్ లో బెన్ స్తోక్స్ చివరి వికెట్ కి ఇంగ్లాండ్ ని గెలిపించిన తీరుకి అభిమానులు ఫిదా అయిపోయారు…

అంతర్జాతీయ క్రికెట్ నుంచి టీం ఇండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా ఈ ఏడాదే తప్పుకున్నాడు.

రంజీ ట్రోఫీలో ఝార్ఖండ్ జట్టు… ఫాలో ఆన్ ఆడి కూడా గెలవడం క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ చీఫ్ గా గంగూలీని నియమించడం కూడా ఈ ఏడాది ఒక సంచలనం.

బంగ్లాదేశ్ కీలక ఆటగాడు… షకిబుల్ హసన్, ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ళ నిషేధానికి గురయ్యాడు.

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ సాధించిన ట్రిపుల్ సెంచరి కూడా ఈ ఏడాది సంచలనం. ఇలా క్రికెట్ పరంగా ఈ ఏడాది అనేక సంచలనాలు నమోదు అయ్యాయి.

తాజాగా జరిగిన ఐపియల్ వేలంలో ఆసిస్ స్టార్ ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్ ని కోలకతా 15 కోట్లకు కొనుగోలు చేసింది… అదే విధంగా కోటి రూపాయలు కనీస ధర ఉన్న పియూష్ చావ్లా ఆరు కోట్లకు అమ్ముడు పోవడం ఈ ఏడాది సంచలనం…

Read more RELATED
Recommended to you

Exit mobile version