చంద్రబాబుకి సీనియర్లు వార్నింగ్…!

-

ఆంధ్రప్రదేశ్ రాజదానులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చికాకుగా మారింది. ఇప్పుడే ఓటమి నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకుందామని భావిస్తున్న నేతలకు జగన్ ప్రకటన కంటి మీద కునుకు లేకుండా చేసింది. రాజధాని మార్పుతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని భావించిన కమిటి జగన్ కి నివేదిక కూడా ఇచ్చింది. దీనితో కీలకమైన విశాఖకు సచివాలయాన్ని తరలించడ౦ అనేది దాదాపుగా ఖాయమైంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

 

జగన్ ప్రకటనపై రాజధాని ప్రాంతాల్లో పరిస్థితులు కాస్త ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. నిరసనలు ఆందోళనలతో దాదాపు పది రోజుల నుంచి రాజధాని ప్రాంతం ఆందోళనకరంగా మారింది. ఈ నేపధ్యంలో చంద్రబాబుకి పార్టీ నేతలు కీలక హెచ్చరిక చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ రాజధాని మారిస్తే మాత్రం జగన్ అత్యంత బలవంతుడు అయిపోతాడని, మనకు కాస్తో కూస్తో బలం ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాల్లో మినహా,రాష్ట్రం మొత్తం జగన్ కు అనుకూలంగా మారుతుందని హెచ్చరించారట.

ఈ రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లోను జగన్ నిర్ణయంపై సానుకూలత ఉందని కాబట్టి మనం ఇబ్బంది పడటం ఖాయమని, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి మాట్లాడాలని పలువురు సీనియర్ నేతలు కోరినట్టు తెలుస్తుంది. రాజకీయంగా జగన్ తన నష్టాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో సమర్ధుడని, కాబట్టి ఇప్పుడే జాగ్రత్తపడాలని, లేకపోతే రెండు జిల్లాల్లో మినహా మినహా మనకు ఎక్కడా బలం ఉండదని నేతలు చంద్రబాబుకి హెచ్చరించారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version