ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పిన సజ్జనార్‌

-

టీఆర్‌ఎస్‌ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. గురువారం తార్నాక‌లోని ఆర్టీసీ ఆస్ప‌త్రిలో న‌ర్సింగ్ కాలేజీ, ఆక్సిజ‌న్ ప్లాంట్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రై ప్ర‌సంగించారు. ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ అన్ని విధానాలుగా ఆరోగ్యవంతంగా ముందుకు వెళుతుందని సజ్జనార్‌ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది, అధికారుల సమన్వయంతో సంస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని సజ్జనార్‌ సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ల సహకారం, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డిల నేతృత్వంలో ఎన్నో కీలక నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బందికి ఇక నుంచి ప్రతి ఏటా అవార్డులు అందజేయనున్నట్టు స‌జ్జ‌నార్ ప్రకటించారు. అంతేకాకుండా ఆర్టీసీలో కారుణ్య నియమకాల ప్రక్రియ వేగవంతం చేస్తామని స్ప‌ష్టం చేశారు ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్. తొలివిడతలో 200 నుంచి 300 వరకు కారుణ్య నియామకాలు త్వరలోనే చేపడతామన్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బోర్డు సమావేశాన్ని నిర్వహించుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version