ప్రజల గుండెళ్ళో గులాబీ మల్లు గుచ్చుకుంది : మధు యాష్కీ

-

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై.. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌ విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ ద్రోహులు కేసీఆర్‌ పక్కన చేరి… కేసీఆర్‌ను పొగుడుతున్నారన్నారు. నిన్నమొన్నటి దాక నోటిఫికేషన్లు రాలేదని ఆయన మండిపడ్డారు. ఉద్యమ పార్టీకి వెయ్యి కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించి మధు యాష్కీ.. 800 కోట్ల నగదు ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల గుండెళ్ళో గులాబీ మల్లు గుచ్చుకుందని, ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఎక్కడో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముక్కోణపు పోటీ సృష్టించి గెలవాలని టీఆర్‌ఎస్‌ వ్యూహాలు చేస్తోందని, కేసీఆర్‌ కుట్రలు జనం పసిగట్టండని ఆయన వ్యాఖ్యానించారు. జానారెడ్డి లాంటి సీనియర్ ఓడిపోవడం పార్టీ కి నష్టం అయ్యిందని, అందుకే అక్కడ రాహుల్ గాంధీ సన్నాహక సమావేశం పెట్టారన్నారు. కేసీఆర్‌ కుట్ర పూరితంగా మళ్లీ గెలవాలని చూస్తున్నారని, కాంగ్రెస్‌తో పొత్తు అనే ఇండికేషన్ లు కేసీఆర్‌ ఇస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అయన బీజేపీనీ బలోపేతం చేసే పనిలో ఉన్నాడని ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version