ఈ నెల 16న దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం…

-

బెజవాడ దుర్గ గుడి ఫ్లై ఓవర్ పనులు పూర్తికావడంతో ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారు చేసింది ఏపీ సర్కార్. ఈనెల 16న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానంలో జరిగి కార్యక్రమంలో రూ. 7వేల 584 కోట్లతో చేపట్టబోయే 16 జాతీయ రహదారి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు కేంద్ర మంత్రి. రూ. 8 వేల కోట్లతో పూర్తిచేసిన 10 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముక్యమత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, నేతలు పాల్గొననున్నారు.

రూ.15,622 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, చేపట్టబోయే వాటికి శంకుస్థాపనలు జరగనున్నాయి. వీటిలో బెంజిసర్కిల్‌పై ఫిబ్రవరి నుంచే ఒకవైపు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు దానిని జాతికి అంకితం చేయనున్నారు. తొలుత ఈ కార్యక్రమాలను సెప్టెంబర్ నాలుగున చేపట్టడానికి ముహూర్తం నిర్ణయించారు. కానీ అప్పట్లో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణించడంతో ఆ ముహూర్తాన్ని 8కి మార్చారు. అన్నీ సన్నద్ధమవుతున్న తరుణంలో సెప్టెంబర్‌ 18కి వాయిదా వేశారు. ఇంతలో కేంద్రమంత్రి గడ్కరీకి కరోనా సోకడంతో మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు ఈనెల 16న వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version