ఆస్ట్రేలియా వేదిక జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)లో టీమిండియా అద్భుతం చేసింది. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన జట్టుకు ఓటమి తప్పదని అంతా భావించారు. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కేవలం 150 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా పోయినట్లే అని క్రికెట్ అభిమానులు భావించారు.
కానీ, ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 51 ఓవర్లలోనే 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 2000 నుంచి స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. తక్కువ స్కోరు చేసిన మ్యాచుల్లో ఇది మూడోవదిగా నిలిచింది. సౌత్ ఆఫ్రికాతో 85, ఇంగ్లండ్‌తో 98, ఇండియాతో 104, పాకిస్తాన్‌తో 127, న్యూజిల్యాండ్ 136, ఇంగ్లండ్‌తో 138 రన్స్‌కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది.