Pushpa 2: పుష్ప 2 ఐటెం సాంగ్ ‘కిస్సిక్’ ప్రోమో వచ్చేసింది !

-

KISSIK Song Promo Pushpa 2 The Rule: పుష్ప 2 ఐటెం సాంగ్ ‘కిస్సిక్’ ప్రోమో వచ్చేసింది. కాసేపటి క్రితమే.. పుష్ప 2 ఐటెం సాంగ్ ‘కిస్సిక్’ ప్రోమో రిలీజ్ చేశారు. పుష్ప 2 ఐటెం సాంగ్ ‘కిస్సిక్ లో శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పూర్తి పాటను రేపు సాయంత్రం 7:02 PM రిలీజ్‌ చేయనున్నారు.

KISSIK Song – Promo

కాగా, అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైన  విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. ట్రైలర్ రిలీజ్ కాగానే ఎగబడి చూసేశారు. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కానుండగా..  ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి కేవలం 24 గంటలు కూడా కాకముందే పది కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 ట్రైలర్ పై సినీ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

KISSIK Song - Promo | Pushpa 2 The Rule | Allu Arjun | Sukumar | Sreeleela | DSP

 

Read more RELATED
Recommended to you

Exit mobile version