తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కొత్త సంవత్సరం వేళ అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా.. అనుకోకుండా జిల్లాలోని చివ్వేంల మండలం లక్ష్మణ్ నాయక్ తండాలో దారుణ హత్య చోటుచేసుకుంది.
పాత కక్షలతో నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి పెద్దనాన్న కొడుకు ధరావత్ శేషు (35)ను కత్తితో పొడిచి తన బాబాయి కొడుకు ధరావత్ దీపక్ హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడు దీపక్‌కు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు హత్య నేరం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, శేషు హత్యకు భూ తగాదాలే కారణమని తెలుస్తోంది.