ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం సాధించిన భారత్

-

ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో భజరంగ్ పునియా తన సత్తాను చాటి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్స్ లో జపాన్ కు చెందిన  తకాటాపై  11-8 తేడాతో పునియా ఘన విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్ లో మంగోలియాకు చెందిన బచూలున్ పై 10-0 తో సంచలన విజయాన్ని నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version