తెలుగు రాష్ట్రాలకు మోదీ ఇచ్చిన బహుమతి.. వందే భారత్ : కిషన్ రెడ్డి

-

వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రైలు.. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన బహుమానం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ హయాంలో దేశంలో అద్భుతమైన ప్రగతి జరుగుతోందని చెప్పారు. ఇవాళ వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రైలును ప్రారంభించుకోవడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ.699 కోట్లతో ఆధునీకరిస్తున్నాం. స్టేషన్‌లో కొత్త భవనాలు రానున్నాయి. నూతన సాంకేతికతతో ఆధునీకరించబోతున్నాం. త్వరలోనే ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు.

కాసేపట్లో సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలు పరుగుపెట్టనున్న క్రమంలో నేతలంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version