భారతదేశం అంటే గతంలో అగ్రదేశాలకు చిన్న చూపు ఉండేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివాిరం నాగోల్ జీఎస్ఐ ఇన్స్టిట్యూట్‌లో రూప్ టాప్ సోలార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భారత్ వంటి దేశాలను థర్డ్ వరల్డ్ దేశాల కింద చూసేవారని గుర్తుచేశారు. అమెరికా, రష్యా లాంటి దేశాల సహకారం లేకుండా సొంతంగా అభివృద్ధి చెందలేవనే భావన ఉండేదన్నారు.
ప్రపంచంలోని ఏదైనా బ్యాంకులు సపోర్ట్ చేస్తే తప్పా ఈ దేశం అభివృద్ధి చెందలేదనే భావన ఉండేదని ఆవేదన వ్యక్తంచేశారు.2014కు ముందు భారత్ పట్ల అందరికీ అదే భావన ఉండేదన్నారు. మోడీ భారత ప్రధాని అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. అతి తక్కువ కాలంలో తక్కువగా మాట్లాడి ప్రపంచంలోనే భారత్ ప్రతిష్టని, గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి మోడీ అని కొనియాడారు.శాస్త్రవిజ్ఞాన ఫలాలు సమాజానికి అందించి, ప్రపంచ చిత్ర పటంపై భారత్ ఔన్నత్యం, గొప్పతనాన్ని చాటి చెప్పారని తెలిపారు.