దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీకి నిన్న కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. మత కల్లోలాకు కారణమై జైల్లో ఉండాల్సిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిందని ఆరోపించారు . అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టాలని ఎల్‌కే అద్వానీ ప్రారంభించిన రథయాత్ర మత కల్లోలాలు సృష్టించ్చారని అన్నారు. ఎల్కే అద్వానికి భారతరత్న ఇచ్చి బిజెపి పార్టీ దేశానికి ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటుందని ప్రశ్నించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 30-35 స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని తెలిపారు. ఇండియా కూటమిలో అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని కాంగ్రెస్‌కు సూచించారు.