బోయిన్ పల్లిలో కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిల ప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా అఖిలప్రియ భర్త, A3 భార్గవ్ రామ్ పరారీలోనే ఉన్నాడని అంటున్నారు. భార్గవ్ రామ్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుటోంది. కిడ్నాప్ అనంతరం బెంగుళూరు అటునుంచి మైసూర్ పరారీ అయినట్టు గుర్తించిన పోలీసులు, మైసూర్ లో భార్గవ్ రామ్ తలదాచుకున్నట్లు పోలీసుల గుర్తించారు.
చంచల్ గూడ జైలు లో రిమాండ్ ఖైదీగా టిడిపి నేత A1 అఖిల ప్రియ ఉన్నారు. ఈరోజు నేడు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కిడ్నాప్ కు సంబంధించి సాంకేతిక ఆధారాలతో పోలీసుల విచారిస్తున్నారు. భూమి పత్రాలు లేకుండానే భూమి తమదే అంటూ అఖిలప్రియ భార్గవ్ రామ్ బెదిరింపులకు పాల్పడినట్టు చెబుతున్నారు. భూమిపై ఏవీ సుబ్బారెడ్డి అఖిల ప్రియ ఇద్దరూ తేల్చూకోవలని ప్రతాప్ రావు ఫామిలీ చెబుతోంది. అయితే మెయిన్ కిడ్నాపర్ ప్రకాష్ కోసం నాలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు పోలీసులు.