ఖమ్మంలో కొత్త మలుపు..కేసీఆర్‌తో భట్టి..!

-

ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ భారీ స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు వచ్చారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా సభకు వచ్చారు. ఇక వీరంతా పూర్తిగా బీజేపీని టార్గెట్ చేసి విరుచుకుపడ్డారు. అనంతరం కేసీఆర్ సైతం మాట్లాడుతూ..బీజేపీపై ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక దేశం నాశనం అయిందని, ఆర్ధిక వ్యవస్థ కూలిందని విరుచుకుపడ్డారు. అయితే కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ దొందూదొందే అంటూ విమర్శించారు.

ఇక సభకు ముందు కేసీఆర్ ఖమ్మం కలెక్టరేట్, కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే కంటివెలుగు ప్రారంభ కార్యకరమంలో ఊహించని సన్నివేశం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కంటి వెలుగు రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత జాతీయ నేతలకు భట్టిని పరిచయం చేశారు.

అయితే భట్టి ఖమ్మం జిల్లాలో మధిర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగానే ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. గతంలో కూడా భట్టి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు దళిత బంధు పథకానికి భట్టి విక్రమార్క మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇలాంటి పథకాలు రావడం మంచి పరిణామమని గతంలో అన్నారు. ప్రగతిభవన్‎లో దళిత బంధు కార్యక్రమం అమలుపై నిర్వహించిన అఖిలపక్ష భేటీకి.. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన హాజరయ్యారు.

అదే విధంగా అసెంబ్లీలో బీజేపీని టార్గెట్ చేస్తూ భట్టి ఫైర్ అవుతూ..కేసీఆర్‌కు మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలా కేసీఆర్‌ని కలిశారు. మరి భట్టి ఎమ్మెల్యేగానే హాజరయ్యారా? లేక ఏమైనా ట్విస్ట్ ఉందా? ఏమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version