పిల్లల కోసం ప్లాన్‌ చేసేవారు డైట్ లో పక్కా వీటిని తీసుకోవాల్సిందే..!

-

ప్రెగ్నెన్సీ సమయంలో ఎలా అయితే మహిళలు మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారో… ప్రెగ్నెన్సీ ముందు కూడా మహిళలు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వలన మహిళలు ఆరోగ్యంగా ఉండగలరు. ప్రెగ్నెన్సీకి వారి శరీరాన్ని రెడీ చేసుకోగలుగుతారు. చాలామంది గర్భం ధరించిన తర్వాత పోషకాహారం తీసుకోవాలి అని అనుకుంటారు.

కానీ గర్భం రావడానికి ముందు కూడా మహిళలు కచ్చితంగా మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. సంతాన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పుట్టుకతో వచ్చే లోపాలు ప్రమాదం కూడా తగ్గుతుంది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు మంచి డైట్ తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి పైగా గర్భధారణ సమయంలో స్త్రీల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకనే ముందు నుండి కూడా పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఎటువంటి ఆహార పదార్థాలని మరి డైట్ లో మహిళలు తీసుకోవాలి అనేది చూద్దాం.

క్యాల్షియం:

క్యాల్షియంని ఖచ్చితంగా మహిళలు తీసుకోవాలి. క్యాల్షియం పిల్లలు ఎముక పెరుగుదలకు తోడ్పడుతుంది. సాల్మన్, సోయాబీన్స్, ఆకుకూరలు, అంజీర్, పాల పదార్థాలు, రాగి వంటివి తీసుకుంటూ ఉండండి,

ఐరన్:

ఐరన్ కూడా చాలా అవసరం. పాలకూర, బాదం, బచ్చలకూర, జీడిపప్పు, ఎండు ఖర్జూరం వంటివి తీసుకుంటూ ఉండాలి.

అయోడిన్:

థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తికి ఇది అవసరం కాబట్టి అయోడిన్ లోపం కూడా లేకుండా చూసుకోండి.

విటమిన్ సి:

విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్ వంటి వాటిలో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి విటమిన్ సి వుండే వాటిని కూడా తీసుకోండి.

విటమిన్ ఏ:

విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా డైట్ లో తీసుకోవాలి. క్యారెట్, బొప్పాయి, గుడ్లు, పాలు, గుమ్మడికాయ, జామ వంటి వాటిలో ఇది దొరుకుతుంది.

విటమిన్ బి:

విటమిన్ బి ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండాలి. కూరగాయలు, గుడ్లు, మాంసం, చిలకడ దుంపలు మొదలైన వాటిలో ఇది ఉంటుంది వీటితో పాటుగా మీరు ఇంకా మెగ్నీషియం, జింక్ ఉండే ఆహార పదార్థాలను కూడా డైట్లో చేర్చుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version