నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకం : డిప్యూటీ సీఎం

-

రేపటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకం ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ.. మైనార్టీ కార్పొరేషన్ ల ద్వారా నిరుద్యోగ యువతకి మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు సాయం చేయనున్నట్లు వివరించారు.

అయితే 6 వేల కోట్లతో ప్రారంభించనున్న ఈ రాజీవ్ యువ వికాసం కోసం మార్చి 15 నుండి దరఖాస్తుల స్వీకారం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున లబ్దిదారులకు పథకాలు అందుతాయి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయితే ఈ పథకంతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది అని ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news