ఈ రోజు తెలంగాణ సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క యాదాద్రి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో మూసాయిపేటలో ఐకేపీ కేంద్రం వద్ద వర్షాల కారణంగా తడిసి ముద్దైన ధాన్యాన్ని చూసి రైతులకు ధైర్యాన్ని చెప్పిండు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ లో భట్టి మాట్లాడారు. ఆ తర్వాత రఘనాధపురంలో పవర్ లూమ్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత దుర్గమ్మ గుడిలో పూజలు చేసి బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక BRS ప్రభుత్వం ఆలేరు నీటిని అందించడంలో చేసిన ద్రోహాన్ని అక్కడి ప్రజలకు గుర్తు చేశారు.
భట్టి విక్రమార్క: ఇందిరమ్మ రాజ్యం వస్తేనే తెలంగాణ బాగుపడుద్ది !
-