సినీ పరిశ్రమలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గద్దర్ అవార్డుల కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి గద్దర్ అవార్డుల విధివిధానాలు,నియమ నిబంధనలు,లోగో రూపకల్పన కోసం సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి గత ఆక్టోబర్ 14న కమిటీ సభ్యులతో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి తిరిగి నేడు మరోసారి వారితో సమావేశమయ్యారు.గద్దర్ అవార్డు లోగో, విధివిధానాలు, నియమ నిబంధనలపైన కమిటీ సభ్యులు చేసిన ప్రతిపాదనలు,సూచనలపై విస్తృతంగా చర్చించారు.గద్దర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని పెద్ద పండుగలా జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చివరగా కమిటీ సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుని, సీఎం రేవంత్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.