కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ పదే పదే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా ఏయే నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఎంత చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేసిందనే విషయాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభా వేదికగా ప్రకటించారు.
‘మాజీ సీఎం కేసీఆర్ నియోజకర్గమైన గజ్వేల్‌లో 2018 సంవత్సరంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 104.3 కోట్ల రుణమాఫీ చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్‌లో 237.33 కోట్ల రుణమాఫీ చేసింది. ఇక కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో 2018లో నాటి ప్రభుత్వం 101.76 కోట్ల రుణమాఫీ చేయగా.. తమ ప్రభుత్వం రూ.175.84 కోట్ల రుణమాఫీ చేసింది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన సభా వేదికగా ప్రకటించారు.