‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం.. చెత్త ఊడ్చిన సీఎం చంద్రబాబు

-

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు తణుకులోని ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చారు.అనంతరం కార్మికులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, వారికి అవగాహన కల్పించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పారిశుధ్య కార్మికులను ఆత్మీయంగా పలకరించిన చంద్రబాబు..వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కూటమిలోని పార్టీ నేతలు సైతం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

https://twitter.com/JaiTDP/status/1900780212754980874

Read more RELATED
Recommended to you

Exit mobile version