భీమ్లా నాయ‌క్ : ప్ర‌పంచ వ్యాప్తంగా పూన‌కాలు..వావ్ వావ్

-

ప‌వ‌న్ ఇప్పుడు స‌రికొత్త మానియాను సృష్టించ‌బోతున్నారు. త‌న‌దైన పంథాలో సినిమాలు చేస్తూ కొత్త ఉత్సాహం ఒక‌టి నింప‌బోతున్నారు. సినిమా సినిమాకూ త‌న స్టామినాను పెంచుకుంటూ క‌మ‌ర్షియల్ ఫిల్మ్ కు ట్రెండ్ సెట్ట‌ర్ అవుతున్నారు.ఆ క్ర‌మంలోనే భీమ్లా నాయ‌క్. ఆయ‌న సినిమాలంటే మాస్ ఆడియెన్స్ కు పండ‌గ.ఫ్యాన్స్ కు పూన‌కాలే పూన‌కాలు.

సినిమా మొద‌టి నుంచి చివ‌రి దాకా అవి కొన‌సాగుతూనే ఉంటాయి. ఇక ఖాకీ చొక్కా వేసుకుని హీరో తెర‌పై సంద‌డి చేస్తుంటే ఆ రేంజ్ మ‌రోలా ఉంటుంది అదే ప‌వ‌న్ వేసుకుంటే ప్ర‌భంజ‌నంలా ఉంటుంది.ఈ సినిమా మొద‌ట్నుంచి మంచి హైప్ నే క్రియేట్ చేసింది.ఆరంభం నుంచి ఇప్ప‌టిదాకా నాన్ స్టాప్ గా రికార్డులు కొడుతూనే ఉంది.

ముందుగా ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యానికే వ‌స్తే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నా కూడా ఆంధ్రాలో థియేట‌ర్ల వ‌ర‌కూ విభిన్న‌మ‌యిన వాదం ఒక‌టి ఉంది.అదే జ‌గ‌న్ రూపంలో వినిపిస్తోంది. జ‌గన్ వ‌ర్గం రూపంలో వినిపిస్తోంది.దీంతో సినిమా ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయినా కూడా ఇక్క‌డ అనుకున్న విధంగా డ‌బ్బులు రావ‌డం క‌ష్ట‌మే ఎందుకంటే టికెట్ రేట్ల విష‌యం న‌డుస్తోంది క‌నుక ! అందుకే ఎక్కువ రేట్ల‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ చేయ‌నివ్వ‌కుండా మీడియం రేట్ల‌కే ఇక్క‌డ థియేట్రికల్ బిజినెస్ చేశారు. సినిమా ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకుంది క‌నుక మంచి లాభాలే డిస్ట్రిబ్యూట‌ర్లు,బ‌య్య‌ర్లు చ‌వి చూడ‌డం ఖాయం.

ప్ర‌పంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ విష‌యంలో కానీ లేదా మోస్ట్ ఎవైటింగ్ మూవీస్ లిస్టులో కానీ ఈ సినిమా మంచి స్థానంలో మొద‌ట్నుంచీ ఉంది.ఓవ‌ర్సీస్ బిజినెస్ బాగానే ఉంది క‌నుక సినిమాను అదే సేఫ్ జోన్ లో ఉంచుతుంది. ప‌వ‌న్, రానా మానియాతో సినిమా మ‌రో లెవ‌ల్ కు చేరుకోవ‌డం ఖాయం.ఇక తెలంగాణ‌లో ఐదు షోల‌కు అనుమ‌తి ఉండ‌డంతో పాటు టికెట్ రేటు అక్క‌డ ఆంధ్రాతో పోలిస్తే కాస్త ఎక్కువ‌గానే ఉండడంతో ఈ సినిమా సేఫ్ జోన్ లో ఉండ‌డ‌మే కాదు లాభాలు తీసుకువ‌చ్చే అవ‌కాశాలే పుష్క‌లంగా ఉన్నాయి.

అదేవిధంగా తెలంగాణ అంత‌టా ప‌వ‌న్ మానియా విప‌రీతంగా ఉంటుంది. క‌నుక ఈ సినిమాకు ఆంధ్రా క‌న్నా తెలంగాణ‌లోనే ఎక్కువ లాభాలు తీసుకువ‌చ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలానూ ఓవ‌ర్సీస్ బిజినెస్ బాగుంది క‌నుక నిర్మాత‌కు పెద్ద‌గా న‌ష్టాలేవీ రావు. సినిమా యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా నిర్మాత పోగొట్టుకునేదేమీ ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version