ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చుట్టుముట్టారు. ఇక స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యా దురాక్రమణపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏకాకులం అయిపోయామని.. మాది ఒంటరి పోరే అని ఆవేదన వ్యక్తం చేశారు. నాటోలోని 27 దేశాలకు ఫోన్ చేశామని.. సహాయాన్ని ఆర్థించామని, ఎలాంటి స్పందన లేనది అన్నారు.
ఏకాకులం అయిపోయాం… మాది ఒంటరి పోరే: ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన
-