BREAKING : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రేపే “భీమ్లా నాయక్‌” ప్రీ రిలీజ్‌ ఈవెంట్

-

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ కు శుభవార్త చెప్పింది భీమ్లా నాయక్‌ చిత్ర బృందం. భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తాజాగా ప్రకటించేసింది. రేపు సాయంత్రం 6.30 గంటలకు భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించబోతున్నట్లు పోస్టర్‌ ద్వారా ప్రకటన చేసింది సితార ఎంటర్‌ టెన్‌మెంట్‌.

రేపు సాయంత్రం హైదరాబాద్‌ యూసఫ్‌ గూడ్‌ పోలీస్ గ్రౌండ్‌ లో ఈ ఈవెంట్‌ ను నిర్వహించనున్నారు. ఇక ఈ అప్టేట్‌ తో.. ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.కాగా.. భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ పిబ్రవరి 21 వ తేదీన అంటే నిన్నటి రోజున జరుగాల్సి ఉండేది.

కానీ… ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. అకాల మరణం కారణంగా… భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ను చిత్ర బృందం వాయిదా వేసుకుంది. అయితే.. ఈ కార్యక్రమాన్ని రేపు నిర్వహించేందుకు సిద్దం అయింది. కాగా.. భీమ్లా నాయక్‌ మూవీ ఈ నెల 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version