BHEEMLA NAYAK : పవన్ ‘భీమ్లా నాయక్’ సాంగ్ వీడియో లీక్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్‌. యంగ్‌ డైరెక్టర్‌ సాగర్‌ కే, చంద్ర ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే సంయుక్త మీనన్ హీరో రానా సరసన నడుస్తోంది.మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్.

ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి వచ్చిన.. పోస్టర్లు, టీచర్లు మరియు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసింది చిత్రబృందం. ఫిబ్రవరి 25 వ తేదీన బీమ్లా నాయక్ సినిమా విడుదల కానుంది.అయితే ఈ మూవీకి లీకుల బెడద తప్పడం లేదు.

ఇప్పటికే సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ కళావతి పాట లీక్ కాగా అదే సమస్య ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా కు కూడా చోటుచేసుకున్నాయి. భీమ్ భీమ్ భీమ్ భీమ్లా నాయక్ పాటను త్వరలో రిలీజ్ చేస్తామని నిర్మాత నాగ వంశీ చేశారు. అయితే ఆ పాటలోని ఓ డాన్స్ బీట్ ను సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఇపుడు దీనిని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version