భూదాన్ స్కామ్.. ఈడీ విచారణ ఎదుర్కొననున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

-

రాష్ట్రంలో భూదాన్ భూముల కుంభకోణంపై ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది.ఈ కేసులో తాజాగా కీలక పరిణామం జరిగింది.నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని ఈడీ అధికారులు సోమవారం విచారించనున్నారు.మాజీ ఎమ్మెల్యే సహా మరో ముగ్గరిని కూడా ఈడీ అధికారులు విచారిస్తారని సమాచారం.వంశీ రామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి,మరో ఇద్దరు కూడా విచారణకు అటెండ్ కావాలని ఈడీ నోటీసులిచ్చింది.

ఈ కేసులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌, ఆర్డీవో, ఎమ్మార్వోను అధికారులు సుదీర్ఘంగా విచారించి కీలక వివరాలను సేకరించారు.మేడ్చల్ జిల్లాలో అమోయ్ కుమార్ కలెక్టర్‌గా పనిచేసిన టైంలో భూ కుంభకోణం జరిగిందని బాధితులు ఈడీకి ఫిర్యాదు చేసింది.రూ.కోట్ల విలువైన భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు ఎలా కేటాయించారని ఐఏఎస్ అధికారి అమోయ్‌ను ఈడీ అధికారులు గతంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version