ఏపీ హైకోర్టులో విక్రాంత్ రెడ్డికి ఊరట..!

-

వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్  హై కోర్టులో ఊరట లభించింది. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ వాటాలు బదిలీ చేశారని ఆయన పై ఆరోపణలు రావడంతో కేసులు నమోదు చేశారు. అలాగే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. దీంతో విక్రాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు అక్కడ ఊరట లభించింది.

Vikranth Reddy Andhrapradesh

సోమవారం ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించిన కోర్టు.. విక్రాంత్ పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఏది ఏమైనప్పటికి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీ కీ కోర్టు ఆదేశించడంతో వైసీపీ ఎంపీ కుమారుడు విక్రాంత్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version